బిగ్ బాస్ షో ఎంతో మందిని లైంలైట్ లోకి తీసుకొచ్చింది. ఊరు పేరు లేని వాళ్లకు ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసింది. అలాంటి వాళ్లలో రీసెంట్ గా ముగిసిన సీజన్ లో శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్ ఉన్నారు. సీజన్ 6 తో వీళ్ళు బాగా ఫేమస్ అయ్యారు. సత్య అంటే అర్జున్ కళ్యాణ్ కి చాలా ఇష్టం కానీ ఆమె మాత్రం అతన్ని అస్సలు పట్టించుకోదు. ఇప్పుడు స్టార్ మాలో వస్తున్న బీబీ జోడి డాన్స్ షోలో మెహబూబ్ తో కలిసి జోడీగా డాన్స్ చేస్తోంది శ్రీసత్య. ఇక ఈ షోలోకి శ్రీసత్య రీసెంట్ గానే ఎంట్రీ ఇచ్చింది ఎందుకు అంటే మెహబూబ్ కి అంతకు ముందు జోడీగా చేసిన అష్షు రెడ్డి ఆరోగ్యం బాగోని కారణంగా షో నుంచి వెళ్ళిపోయింది. అసలే జోడీ షో కాబట్టి మెహబూబ్ కి జోడిగా శ్రీసత్యను ప్రవేశ పెట్టారు మేకర్స్.
వీళ్లంతా కూడా రెగ్యులర్ గా ఒక చోట డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అలా అర్జున్-వాసంతి, మెహబూబ్-శ్రీసత్య జోడీలు ప్రాక్టీస్ చేస్తూ ఉండగా "ఇది మా ప్లేస్ మేము కూడా డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవద్దా" అని మెహబూబ్ అర్జున్ కళ్యాణ్ మీద సడెన్ గా ఫైర్ అయ్యాడు. "నేనేమి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కదా ఐనా రీల్ జోడినే కదా మీరు రియల్ జోడి కాదుగా" అని అర్జున్ కూడా రివర్స్ లో ఫైర్ అయ్యేసరికి మధ్యలో ఇద్దరినీ విడదీయడానికి శ్రీ సత్య వచ్చింది. వాళ్లిద్దరినీ వారించే ప్రయత్నం చేసింది. ఇంతలో మెహబూబ్ "నువ్వు అరగంట లేట్ గా వచ్చావ్..అందుకే ఈ ప్రాబ్లమ్ వచ్చింది" అని గట్టిగా అరిచాడు.."ఐనా నన్నంటావేంటి" అని సత్య ఏడుపు ముఖంతో అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఇక ఫైనల్ గా మెహబూబ్ ఇదంతా ప్రాంక్ వీడియో అని చెప్పి శ్రీసత్యకు ధమ్కీ ఇచ్చాడు.